Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్నా! నువ్వెప్పుడూ నా కెప్టెన్ వే!: కోహ్లీ ఎమోషనల్ ట్వీట్

మహేంద్ర సింగ్ ధోనీ భారత వన్డే, టీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. తన ట్విట్టర్ లో భావోద్వేగంతో కూడిన ట్వీట్ పెడుతూ, "యువకులకు నిత్యమూ ఓ లీడర్ గా ఉండి వారిని నడిపించినందుకు కృతజ్ఞతలు. చుట్టూ యంగ్ స్టర్స్  ఉండాలని భావిస్తుంటావు. అన్నా! ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వే" అని ఈ ఉదయం 9:30 గంటల సమయంలో ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. కాగా, త్వరలో ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ గా ఆడనున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్యా జనవరి 15న తొలి మ్యాచ్ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.

More Telugu News