కురచగా వున్నది వారి దుస్తులు కాదు, విమర్శించే వారి ఆలోచనా విధానమే!: అక్షయ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కురచగా వున్నది వారి దుస్తులు కాదు, విమర్శించే వారి ఆలోచనా విధానమే!: అక్షయ్ కుమార్

బెంగళూరులో డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి మహిళలపై జరిగిన వేధింపుల సంఘటనపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో సందేశం పంపారు. అమ్మాయిల దుస్తులపై, వారు బయటకు వచ్చిన వేళలపై అసహనం కలిగించేలా మాట్లాడుతున్న వారిపై ఆయన మండిపడ్డారు. కురచగా వున్నది వారి దుస్తులు కాదని, ఆ విధంగా మాట్లాడుతున్న వారి ఆలోచనా విధానమేనని అన్నారు. అమ్మాయిల అనుమతి లేకుండా వారిని తాకే హక్కు ఎవరికి లేదని, అమ్మాయిలకు తమను తాము సంరక్షించుకునే శక్తి ఉందని, అబ్బాయిల అకృత్యాలను అడ్డుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని మెళకువలు ఉన్నాయన్నారు. అమ్మాయిలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని, కొంచెం జాగ్రత్తగా ఉండటంతో పాటు, ఆత్మరక్షణ నేర్చుకోవాలని సూచించారు. అమ్మాయిల దుస్తుల గురించి విమర్శించే వాళ్లకు ‘మీ పని మీరు చూసుకోండి’ అనే సమాధానం చెప్పాలని ఆ వీడియోలో అక్షయ్ పేర్కొన్నారు.




More Telugu News