ప్రభుత్వ తీరుకి నిరసన... అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం సభ్యులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వ తీరుకి నిరసన... అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం సభ్యులు

తెలంగాణ‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిలను విడుద‌ల చేయ‌డంలో స‌ర్కారు నిర్ల‌క్ష్య వైఖ‌రి అవ‌లంబిస్తూ విద్యార్థులకు న‌ష్టం క‌లిగిస్తోంద‌ని ఆరోపిస్తోన్న కాంగ్రెస్‌, టీడీపీ నేత‌లు త‌మ నిర‌స‌న‌ను ఈ రోజు కూడా కొనసాగించారు. ఈ రోజు శాసనసభ నుంచి కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స‌భ‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఆ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నామని అన్నారు. అయితే స‌ర్కారు చెప్పిన సమాధానాలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్ర‌తిప‌క్ష స‌భ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు. ప్ర‌తిప‌క్షాల తీరుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ వారు వాకౌట్‌ చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
assembly

More Telugu News