యూత్‌లో ఊబకాయం.. ఆయుష్షు క్షీణిస్తుంది
ఇరవయ్యేళ్లు నిండకుండానే ఊబకాయంతో సతమతం అయ్యేవారు మనకు అనేకులు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారికి ఆయు:ప్రమాణం చాలా తక్కువ అయిపోతుందని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోంది. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ.. వ్యక్తుల్ని బట్టి మదుమేహం, హైబీపీ, నాళాల్లో రక్తం గడ్డ కట్టడం, గుండె సంబంధిత వ్యాధులు వస్తుంటాయి.
అయితే ఊబకాయంతో బాధపడుతున్న వారిలో 20 ఏళ్లు దాటిన వారికి కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయిట. ఈ పరిశోధన ఎలాసాగిందంటే.. డెన్మార్క్ మిలిటరీ బోర్డు వారు 1955 లో జన్మించిన 6500 మంది మానసిక, శారీరక వివరాలను 22 ఏళ్ల వయసులో ఉండగా నమోదు చేశారు. మళ్లీ 55 ఏళ్ల వయసులో గుర్తించారు. అప్పట్లో ఊబకాయం ఉన్న వారు చాలామంది 55 రాకముందే చనిపోయినట్లు గుర్తించారు.
యూత్‌లో ఊబకాయం ఉంటే.. షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎనిమిది రెట్లు, బీపీ గుండెపోటు ప్రమాదాలు రెండు రెట్లు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.