తప్పనిసరి అయితే శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే విషయంలో వెనక్కి తగ్గం: భారత కొత్త సైన్యాధ్యక్షుడు
భారత ఆర్మీ యూనిట్లన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ఒక యూనిట్‌గా సమన్వయంతో విధుల్లో పాల్గొంటాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీనియర్ లెఫ్టెనెంట్ జనరల్స్ ప్రవీణ్ బక్షి, పి.ఎం.హరిజ్లను కాదని జనరల్ రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ బక్షి మీడియాతో మాట్లాడుతూ... బిపిన్ రావత్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.