ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కుటుంబ నాట‌కం నడుస్తోంది!: వెంక‌య్య నాయుడు

01-01-2017 Sun 15:00 | National
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కుటుంబ నాట‌కం జ‌రుగుతోందని కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు వ్యాఖ్యానించారు. స‌మాజ్‌వాదీ పార్టీలో జ‌రుగుతున్న ఈ కుటుంబ డ్రామా కామెడీగా ఉంద‌ని, కొన్ని సార్లు మెలోడీగా అనిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు. కానీ, చివ‌రికి ఓ విషాదంగా ముగుస్తుంద‌ని జోస్యం చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీలో ముదిరిన సంక్షోభంపై స్పందించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు స‌మాజ్‌వాదీ ప్ర‌భుత్వం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. మ‌రోవైపు బీఎస్పీ ప‌ట్ల కూడా ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నార‌ని అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తోంద‌ని చెప్పారు. అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ పార్టీ వైపుకు మ‌ళ్లేందుకు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  

నల్లధనం నివారణ చర్యల్లో పెద్దనోట్ల రద్దు ఒకటి మాత్రమేన‌ని వెంక‌య్య నాయుడు అన్నారు. న‌ల్ల‌ధ‌నం నియంత్ర‌ణ‌కు ముందు ముందు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలు రోజుకోమాట మారుస్తూ మాట్లాడుతున్నాయని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక ఏళ్లుగా పేద‌ల‌కు అన్యాయం చేస్తూ వ‌చ్చిందని చెప్పారు. పెద్ద‌ల‌కు మూట‌లు, పేద‌ల‌కు మాట‌లను కాంగ్రెస్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
venkaiah

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more