క్యాష్‌లెస్ లావాదేవీల 'భీం' యాప్ ఎలా ప‌నిచేస్తుందంటే...!

31-12-2016 Sat 07:22 | National

డిజిట‌ల్ భారతం వైపు వ‌డివడిగా అడుగులు వేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా శుక్ర‌వారం భీం పేరుతో క్యాష్‌లెస్ లావాదేవీల కోసం స‌రికొత్త యాప్‌ను విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న యాప్‌ల కంటే దీని వాడ‌కం చాలా సుల‌భ‌త‌రం. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫీచ‌ర్ ఫోన్ల వ‌ర‌కు అన్నింటిలోనూ దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు. అంతేకాదు.. దీనికి ఇంట‌ర్నెట్‌తో ప‌నిలేదు. ప్ర‌స్తుతానికి అయితే ఆండ్రాయిడ్ వెర్ష‌న్ ఫోన్ల‌కు నెట్ ఉండాల్సిందే. అయితే ఇంట‌ర్నెట్‌తో ప‌నిలేకుండా యూఎస్ఎస్‌డీ(మెసేజ్‌) ద్వారా ప‌నిచేసే యాప్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

భీంను ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి

మొద‌ట గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి భీం(బీహెచ్ఐఎం) యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. త‌ర్వాత దీనిని ఓపెన్ చేసి మ‌న‌కు న‌చ్చిన భాష‌ను ఎంపిక చేసుకోవాలి. ఫోన్  నంబ‌రు వెరిఫై చేసుకోవాలి. మ‌న‌మిచ్చే ఫోన్ నంబ‌రు బ్యాంకులో న‌మోదు చేసిన‌దై ఉండాలి.  నంబ‌రు వెరిఫై అయిన త‌ర్వాత సెల్‌కు మెసేజ్ వ‌స్తుంది. దీనికి చార్జీ ప‌డుతుంది. ఆ త‌ర్వాత సీక్రెట్  పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి. త‌ర్వాత మ‌న బ్యాంకును ఎంచుకుని ముందుకెళ్ల‌డ‌మే.

చెల్లింపులు ఇలా చేయొచ్చు..

ఈ యాప్‌లో స్కాన్ అండ్ పే ఆప్ష‌న్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన‌ప్పుడు క్యూఆర్ కోడ్ వ‌స్తుంది. దానిని అవ‌త‌లి వ్య‌క్తుల‌కు పంపితే వారు స్కాన్ చేసి డ‌బ్బులు చెల్లించవ‌చ్చు. ఇదే ప‌ద్ధ‌తితో మ‌నం కూడా డ‌బ్బులు చెల్లించ‌వ‌చ్చు. ఈ లావాదేవీల‌న్నీ మ‌నం మొద‌ట న‌మోదు చేసుకున్న బ్యాంకు నుంచే జ‌రుగుతాయి. కాబ‌ట్టి ఇత‌ర వాలెట్ల‌లా ముందుగా అందులోకి డ‌బ్బులు జ‌మ చేసుకోవాల్సిన ప‌నిలేదు. అలాగే భీంలో న‌మోదు కాని, యూపీఐ లేని ఖాతాదారుల‌కు కూడా ఈ యాప్ సాయంతో డ‌బ్బులు పంపించ‌వ‌చ్చు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, అకౌంట్ నంబ‌రు, ఎంఎంఐటీ, మొబైల్ నంబ‌ర్ల‌ను ఉప‌యోగించి లావాదేవీలు జ‌రిపే వీలుంది. ఈ యాప్ నుంచి డ‌బ్బులు పంపించాలంటే తొలుత యూపీఐ పిన్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుంది.

 ఇందుకోసం యాప్‌లో బ్యాంకు అకౌంట్ వ‌ద్ద‌కు వెళ్తే రీసెట్ పిన్ ఆప్ష‌న్ ఉంటుంది. దానిని క్లిక్ చేసి అది అడిగే వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయ‌డం ద్వారా పిన్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు. ఈ పిన్ సాయంతో ఇత‌రుల‌కు డబ్బులు పంపించ‌వ‌చ్చు. ఒక‌సారి గ‌రిష్టంగా రూ.10 వేలు, రోజుకు రూ.20 వేలు ఈ యాప్ ద్వారా పంపించుకునే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌లో ఉన్న మ‌రో విశేషం ఏంటంటే, దాదాపు అన్ని బ్యాంకుల‌కు ఇది ఒక్క‌టే స‌రిపోతుంది. అందులో న‌మోదై ఉన్న బ్యాంకుల్లో ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకు అయినా లావాదేవీలు జ‌ర‌ప‌వ‌చ్చు.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more