రద్దయిన నోట్లు కలిగి ఉంటే జైలు శిక్ష విధింపు నిబంధన తొలగింపు.. కాసేపట్లో రాష్ట్రపతి వద్దకు ఆర్డినెన్స్.. ఎల్లుండి నుంచే అమలు
ఎల్లుండి నుంచే ఈ ఆర్డినెన్స్ ను అమలులోకి తీసుకురానున్నారు. అయితే, పాతనోట్లు కలిగి ఉండి పట్టుబడితే నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ నుంచి తొలగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మీడియాకు చెప్పింది. అలాగే పాత నోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5 వేల జరిమానా విధిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ జరిమానాను 10 వేల రూపాయలకు పెంచింది.