సమాజంలో రెండే కులాలు ఉన్నాయి.. అందులో నాది పేదల కులం: ముఖ్యమంత్రి చంద్రబాబు

29-12-2016 Thu 16:15 | National
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడుతూ.... మోరి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఆ గ్రామంలో రూ.332 కోట్లతో తొమ్మిది నెల‌ల్లో విద్యుత్ స్తంభాల ద్వారా ఫైబ‌ర్‌గ్రిడ్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆ గ్రామాన్ని ఈ రోజే ఓడీఎఫ్‌ గ్రామంగా ప్రకటించినట్టు ఆయ‌న పేర్కొన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వారిపట్ల ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని ఆయ‌న సూచించారు. సమాజంలో రెండే కులాలు ఉన్నాయని, మొద‌టిది డబ్బున్న కులం అయితే, మ‌రొక‌టి డబ్బులేని కులం అని, తనది మాత్రం పేదల కులమేనని ముఖ్యమంత్రి చెప్పారు.

తాను ఎల్ల‌ప్పుడూ పేద‌లకు ఎటువంటి క‌ష్టాలు రాకుండా ఉండాల‌నే ఆలోచిస్తాన‌ని చంద్రబాబు చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమం కింద కొత్త రేషన్‌కార్డులు ఇస్తుంద‌ని చెప్పారు. బుడగ జంగాలను ఎస్సీల్లో కలిపేందుకు ఇప్ప‌టికే కమిటీని వేశామని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌ నోట్లరద్దు నిర్ణయంతో ఎంతో మంది  ప్ర‌జ‌లు క‌ష్టాలు ప‌డుతుండ‌డం ప‌ట్ల తాను ఆవేదన చెందిన‌ట్లు తెలిపారు. వారి క‌ష్టాల‌ను అర్థం చేసుకొనే జనవరి నుంచి పెన్షన్లన్నీ పాత విధానంలోనే కొనసాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. కాపు సామాజిక వ‌ర్గంపై తాము ప్రత్యేక శ్రద్దపెట్టినట్టు తెలిపారు. తమ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింద‌ని అన్నారు.
chandrababu

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more