భారీగా నకిలీ రూ.2000 నోట్ల ముద్రణ... ప్రింటింగ్ మిషన్ స్వాధీనం!
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ... హనుమాన్మధీ సమీపంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు నకిలీ రూ.2000, రూ.500 నోట్లతో పట్టుబడ్డారని, వారిని విచారించగా తాము దాడులు జరిపిన ప్రాంతంలో నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు వారు చెప్పారని అన్నారు. తాము బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల మిషన్‌తో పాటు ఓ కారులోంచి కూడా మరో మిషన్‌ను రికవరీ చేశామని అన్నారు. ఈ నకిలీ నోట్ల గ్యాంగ్ అహ్మదాబాద్‌కు చెందిందని తెలిపారు. నకిలీ నోట్లను ముద్రించి పలువురికి కమీషన్ ఆశ చూపి వాటిని మార్పిడి చేస్తున్నారని చెప్పారు.