రష్యాపై ఆంక్షలు విధించనున్న అమెరికా.. ట్రంప్ కూడా ఉపసంహరించలేని విధంగా చర్యలు
అయితే, రష్యన్ హ్యాకర్లను శిక్షించడం కష్టతరమయిన పని అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. రష్యా హ్యాకర్లు చేసిన ఈ చర్యపై రష్యాకు తమ ప్రతిస్పందన ఎలాగుంటుందో తెలియజేయాలని అమెరికా యోచిస్తోంది. రష్యా హ్యాకర్లను శిక్షించి తమదేశ ఎన్నికల వ్యవస్థ ఎంత కఠినంగా ఉంటుందో తెలియజేయాలని ఒబామా భావిస్తున్నారు. రష్యాపై తీసుకోనున్న ఈ చర్యలను అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ కూడా భవిష్యత్తులో ఉపసంహరించలేని విధంగా తీసుకోవాలని అమెరికా ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.