అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావుకు గుండెపోటు

తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుకు గుండెపోటు వ‌చ్చింది. ఇటీవ‌లే ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు రామ్మోహ‌న్‌రావు ఇంటితో పాటు ఆయ‌న బంధువుల ఇళ్ల‌లోనూ దాడులు నిర్వ‌హించి కోట్ల రూపాయ‌ల న‌గ‌దు, భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో తమ‌ళ‌నాడు ప్ర‌భుత్వం ఆయ‌న‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్శ‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి తొల‌గించింది. ఈ నేప‌థ్యంలోనే ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌ అస్వస్థతకు గురయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ చెన్నయ్‌లోని పోరూరు రామచంద్ర ఆసుపత్రిలో అత్యవసరవార్డులో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
demonitisation

More Telugu News