ఎగుమతి దారుడి వద్ద ఏకంగా 40 కేజీల బంగారం... అరెస్టు
ఈ బంగారాన్నంతా దుబాయి నుంచి దిగుమతి చేసుకున్నాడు. బంగారు ఆభరణాలు తయారు చేసి మళ్లీ దుబాయ్‌కి వాటిని ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అయితే, దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నిందితుడు దేశీయ మార్కెట్లోకి దాదాపు రూ.150 కోట్ల విలువైన బంగారం తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. నల్లకుబేరులకు ఈ బంగారాన్ని అందిస్తూ వారి వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్చుకునేందుకు సహకరిస్తున్నాడని అధికారులు తెలుసుకున్నారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకెళ్లారు. తరువాత అతడిని రిమాండ్‌కు తరలించారు.