రూ.5.4 కోట్ల ట్యాక్స్ పెండింగ్ ఉందంటూ ఆఫీస్ బోయ్కు నోటీసులు పంపించిన ఐటీ అధికారులు
భయందర్ లోని గణేశ్ దేవల్ నగర్ కు చెందిన రవి కాండివ్లిలో చార్టెడ్ ఎకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ వద్ద 2008 ఆగస్టులో పని చేశాడు. అప్పట్లో రవి వద్ద నుంచి బ్యాంకు ఖాతాకోసం అంటూ బ్యాంకులో జీతం పడుతుందని చెప్పి అతడి పాన్, ఆధార్ కార్డులు తీసుకున్నాడు రాజేశ్ అగర్వాల్. అయితే, రవికి చెల్లించాల్సిన జీతం మాత్రం అకౌంట్లో కాకుండా చేతికే ఇచ్చే వాడు. 2012లో రాజేశ్ దగ్గర పని మానేసిన రవి వేరే కంపెనీలో పనిలో చేరాడు. రవి ఇచ్చిన ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించుకొని రాజేశ్ అగర్వాల్ మోసం చేశాడని పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనలో అగర్వాల్(42)తో పాటు మరో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు థానే కోర్టులో వారిని ప్రవేశపెట్టి, తరువాత జైలుకి తీసుకెళ్లారు.