జయలలిత సినిమాకు మాటలు రాసిన కరుణానిధి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జయలలిత సినిమాకు మాటలు రాసిన కరుణానిధి!

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిల మధ్య ఉన్నంత రాజకీయ వైరం మన దేశంలో మరే ఇద్దరు నేతల మధ్య ఉండకపోవచ్చు. వారిద్దరి నేపథ్యం కూడా ఒకటే. ఇద్దరూ కూడా సినీరంగం నుంచే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 140కి పైగా సినిమాల్లో నటించిన ఘనత పురచ్చితలైవిది కాగా... తమిళ సినీరంగంలో పేరు మోసిన స్క్రిప్ట్ రైటర్ కరుణానిధి. ఆయనతో తమ సినిమాలకు స్క్రిప్ట్ రాయించుకోవడానికి దర్శకులు, నిర్మాతలు పోటీ పడేవారు. జయలలిత 1965లో 'వెన్నిర అడై' అనే సినిమాతో తమిళంలో ఆరంగేట్రం చేశారు. అయితే, ఆ సమయానికి కరుణానిధి సినిమాలకు పనిచేయడం మానేసి, పూర్తి స్థాయి రాజకీయాలలోకి వచ్చారు. కానీ, 1966లో ఎస్ రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'మణి మకుటం' సినిమా వీరిద్దరూ కలసి పని చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ సినిమాలో జయ సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కరుణానిధి స్క్రిప్ట్ అందించారు. కానీ ఆ సమయంలో ఎవరి ఊహకు కూడా అందలేదు... వీరిద్దరూ భవిష్యత్తులో బద్ధశత్రువులుగా మారుతారని!

More Telugu News