: జయలలిత వంటి వారిని ఇంతవరకూ చూడలేదు: కేవీపీ
అనుకున్నది సాధించేవరకూ విశ్రమించని తత్వం దివంగత జయలలితకు సొంతమని, ఆమెవంటి దృఢచిత్తం, వ్యక్తిత్వం ఉన్న నేతలను తాను ఇంతవరకూ చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. జయ అసమాన ధైర్య సాహసాలకు ప్రతీకని, జయ ధీరోదాత్తమైన మహిళని కొనియాడారు. ఆమె మృతి తమిళులతో పాటు జయలలితను అభిమానించే, ప్రేమించే వారందరికీ తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు కేవీపీ వెల్లడించారు. కేవీపీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు జయలలితకు సంతాపం వెలిబుచ్చారు.