6, 6, 6, 6, 6, 6... ఆరు సిక్సుల వీరుడు సాగర్ మిశ్రా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

6, 6, 6, 6, 6, 6... ఆరు సిక్సుల వీరుడు సాగర్ మిశ్రా!

ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు సాధించిన ఆటగాళ్లలో మన ఆటగాడు యువరాజ్ సింగ్ పేరు కూడా వున్న విషయం మనకు తెలుసు. రంజీల్లో రవిశాస్త్రి కూడా ఇలా ఆరు సిక్సులు బాదాడు. ఇక ఈ జాబితాలో వెస్ట్రన్ రైల్వేస్ క్రికెట్ స్టార్ సాగర్ మిశ్రా కూడా తాజాగా చేరాడు. టైమ్స్ షీల్డ్ బీ డివిజన్ మ్యాచ్ లో భాగంగా, సాగర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సాగర్, స్పిన్నర్ తుషార్ కుమార్ బౌలింగ్ లో వరుసగా సిక్సర్లు కొట్టాడు. మొత్తం 46 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. చివరి 11 బంతుల్లో 9 సిక్స్ లను సాగర్ బాదడం గమనార్హం.

More Telugu News