: అమరావతి ప్రాంతంలో బ్యాంకు ఖాతాదారుల గగ్గోలు... ఏమీ చేయలేమంటున్న బ్యాంకులు


ఓ వైపు ఒకటో తారీఖు, మరోవైపు వేసిన పంటలకు పెట్టుబడుల కోసం రైతులు... ఒకేసారి బ్యాంకుల ముందు నగదు విత్ డ్రా కోసం క్యూ కట్టిన వేళ, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మందడం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల వద్ద రైతులు రాస్తారోకో, ఆందోళనలకు దిగారు. తమ ఖాతాల్లోని మొత్తం డబ్బును వెంటనే ఇవ్వాలంటూ రైతులు బ్యాంకు ముందు నినాదాలు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా, రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టు సమాచారం. రైతులు, ప్రజలకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా, ఎన్ని రోజులు ఇలా మభ్యపెడతారని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. తమకు నాలుగు రోజులుగా విత్ డ్రాకు అవకాశం ఇవ్వడం లేదని, తమ పొలాలను కాపాడుకునేది ఎలాగని రైతులు అడుగుతుంటే, నగదు నిల్వలు తమకే అందడం లేదని, ఇక రైతులకెలా ఇస్తామని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News