: స్వల్పంగా పెట్రోల్ ధర పెరిగింది... డీజిల్ ధర తగ్గింది
లీటర్ పెట్రోల్ ధర పెరగగా, డీజిల్ ధర తగ్గింది. లీటర్ పెట్రోల్ పై 13 పైసలు పెరగా, డీజిల్ పై 12 పైసలు తగ్గింది.ఈ మేరకు చమురు సంస్థలు ఒక ప్రకటన చేశాయి. సవరించిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. ‘పెట్రో’ ధరల సవరణ అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.10 పైసలు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.54.57 పైసలుగా ఉంది.