'ఐటెం' అన్నందుకు అభిమానికి క్లాస్ పీకిన అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఐటెం' అన్నందుకు అభిమానికి క్లాస్ పీకిన అనసూయ

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారట కదా? అంటూ సోషల్ మీడియాలో ఓ అభిమాని ప్రశ్న వేయడంతో యాంకర్, నటి అనసూయ అరగంట సేపు అతనికి క్లాస్ పీకింది. దయచేసి దాన్ని ఐటెం సాంగ్ అనకండి... అది ఒక ప్రత్యేక గీతం అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు... అసలు ఐటెం అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించింది. ఐటెం అంటే ఓ వస్తువని, స్త్రీలను వస్తువులా చూసిన పాత రోజుల్లో, అప్పుడెప్పుడో అలా అనేవారని చెప్పింది. కానీ ఇప్పుడు కూడా అలా అంటే ఎలా? అని ప్రశ్నించింది. అమ్మాయి అంటే వస్తువు కాదని... అందువల్ల వీటిని ఐటెం సాంగ్స్ అని కాకుండా, స్పెషల్ సాంగ్స్ అని పిలవాలని చెప్పింది. మీ సంతోషం కోసం ఓ మోడల్ వచ్చి డ్యాన్స్ చేస్తే... ఆమె ఐటెం అయిపోతుందా? అని అనసూయ ప్రశ్నించింది. మిమ్మల్ని సంతోషపెట్టడానికే ఆ పాటకు ఆమె డ్యాన్స్ చేస్తోందని తెలిపింది. చివరగా... 'ఎస్, నేను సాయిధరమ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నా' అని చెప్పింది.

More Telugu News