ప్రారంభమైన యువరాజ్ వివాహ వేడుకలు.. 'సంగీత్' జోరు
టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ వివాహ వేడుకలు ఛండీగఢ్ లో ప్రారంభమయ్యాయి. ఛండీగఢ్ లోని ప్లస్ సిటీ హోటల్ లో యువరాజ్ సంగీత్ జరుగుతోంది. ఈ వేడుకకు యువీ తల్లి షబ్నం, యువీ సోదరుడు జొరావర్ సింగ్, తండ్రి యోగ్ రాజ్ సింగ్ తదితరులతో పాటు ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్, అజింక్యా రహానే, మహ్మద్ షమీ, మహ్మద్ కైఫ్, ఇషాంత్ శర్మ, ఆశిశ్ నెహ్రా వంటి సీనియర్, జూనియర్ టీమిండియా క్రికెటర్లు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. హాటల్ లో యువీ సంగీత్ హుషారుగా జరుగుతోంది. డిజైనర్ వేర్ లో యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ లు మెరిసిపోయారు.