Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పటివరకు రూ.70 వేల కోట్ల న‌ల్ల‌ధ‌నం బ‌య‌టికొచ్చింది: లోక్ సభ‌లో అరుణ్‌జైట్లీ

న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాజీలేని పోరాటం చేస్తున్నార‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆదాయ‌ప‌న్ను చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై ఈ రోజు ఆయ‌న మాట్లాడారు. అయితే, ఆయ‌న ప్ర‌సంగిస్తుండ‌గా విప‌క్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. లోక్‌స‌భ‌లో హ‌డావుడిగా ఆ బిల్లు ప్రవేశ‌పెట్టార‌ని విప‌క్షాలు విమర్శించాయి. విప‌క్ష నేత‌ల ఆందోళ‌న మ‌ధ్యే జైట్లీ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని తెచ్చేందుకు కొత్త చ‌ట్టం తీసుకొచ్చామ‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ నెల 8న న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు పెద్ద‌నోట్లను ర‌ద్దు చేసేందుకు సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నారని జైట్లీ అన్నారు. న‌ల్ల‌ధ‌నం అనేది ఉండ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 70 వేల కోట్ల రూపాయ‌ల‌ న‌ల్ల‌ధ‌నం బ‌య‌టికొచ్చిందని చెప్పారు. విదేశాల్లోని న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం త‌గిన‌న్ని చ‌ర్య‌లు చేప‌ట్టిందని అన్నారు. మ‌రోవైపు, ఐటీ స‌వ‌ర‌ణ బిల్లుపై ఓటింగ్‌కు కాంగ్రెస్ ప‌ట్టుప‌డుతోంది.

More Telugu News