Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నీకి సింధు దూరం

తనకు ఎంతో పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చిన మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి పీవీ సింధు వైదొలగింది. గత మూడేళ్లగా మకావు టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో, టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా సింధు బరిలోకి దిగాల్సి ఉంది. అయితే, వచ్చే నెలలో జరగనున్న దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సన్నద్ధం కావడానికే సింధు ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తండ్రి రమణ తెలిపారు. మకావు టోర్నీ నుంచి చివరి నిమిషంలో సింధు వైదొలగడంతో, భారత్ కు సైనా నెహ్వాల్ సారధ్యం వహించనుంది.

More Telugu News