: మొబైల్ ఉంటే పర్సుతో పనిలేదు: ప్రధాని మోదీ
మొబైల్ ఉంటే పర్సుతో పనిలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ లో నిర్వహించిన పరివర్తన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ‘దేశప్రజలకు ధన్యవాదాలు .. మొబైల్ లావాదేవీలు జరపడం వచ్చేసింది కదా, ఎవరూ నేర్పకుండానే నేర్చుకోగలిగారు కదా. మొబైల్ ఉంటే పర్సుతో పనిలేదు.. నోట్లు లేకపోయినా డబ్బులు ఖర్చు చేయగలరు. నోట్లను నల్లకుబేరులు ఉపయోగిస్తున్నారు. నల్లధనం నిరోధానికి మీ సహకారం కావాలి. 2014 సార్వత్రిక ఎన్నికలలో వారణాసి నుంచి ప్రచారం ప్రారంభించా. కుశినగర్ లో వచ్చినంత జనాన్ని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. నేను చేస్తున్న పనులను ఆశీర్వదించడానికే ఇంతమంది ప్రజలు తరలివచ్చారు. నేను ప్రజలకు సేవకుడిని మాత్రమే. పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. నల్లధనంపై అలుపెరుగని పోరాటం చేస్తాను. అవినీతిపరుల ఆట కట్టిస్తాను’ అని మోదీ పేర్కొన్నారు.