: క్యాబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చిన మోదీ, ఆపై ఐదు నిమిషాలకే వెళ్లిపోయిన జైట్లీ!


క్యాబినెట్ సమావేశం ఎప్పుడు పెట్టినా, నిర్ణీత సమయానికి రెండు నిమిషాల ముందే అక్కడికి చేరుకునే ప్రధాని, నిన్నటి క్యాబినెట్ సమావేశానికి మాత్రం పావుగంట ఆలస్యంగా వచ్చారు. దేశంలో నల్లడబ్బును దాచుకున్న వారికి ఇంకాస్త వెసులుబాటు కల్పించడం ద్వారా మూలుగుతున్న బ్లాక్ మనీని వ్యవస్థలోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటలకు సమావేశం ఉంటుందని పీఎంఓ ప్రకటించగా, 8:15 గంటలకు మోదీ వచ్చారు. ఆపై ఐదు నిమిషాలకే, అంటే 8:20 గంటలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమావేశ మందిరాన్ని వీడి వెళ్లిపోయారు. క్యాబినెట్ భేటీ మాత్రం 8:45 గంటల వరకూ సాగింది. జైట్లీ లేకుండానే ఈ సమావేశం జరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News