: నా చిన్నప్పుడు అక్కడే గడిపాను: ప్రధాని మోదీ


తన చిన్నప్పుడు రైల్వే ప్లాట్ ఫాంలపైనే గడిపానని ప్రధాని నరేంద్ర మోదీ తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. న్యూఢిల్లీలో రైల్వే వికాస శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నప్పుడు తాను రైల్వే ప్లాట్ ఫాంలపై గడిపానని, ఈ కారణంగానే రైల్వేను ప్రగతి బాటలో నడిపించే బాధ్యత తీసుకున్నానని చెప్పారు. రైల్వేల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై లోతుగా చర్చించేందుకే రైల్వే వికాస్ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కాగా, మోదీ చిన్నతనంలో ఆయన తండ్రి రైల్వే ప్లాట్ ఫాంల వద్ద చాయ్ దుకాణం నడిపేవారు. తండ్రి తయారు చేసిన చాయ్ ను ప్లాట్ ఫాంలపై తిరిగి నాడు మోదీ అమ్మేవారు. అందుకనే, తన చిన్నప్పుడు రైల్వే ప్లాట్ ఫాంలపైనే గడిపానని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News