500, 1000 రూపాయల నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా నగదు జమ అవుతోంది. అకస్మాత్తుగా కేంద్రం నిర్ణయం ప్రకటించడంతో కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేక చాలా మంది బ్యాంకుల ముందు క్యూకట్టారు. దీంతో భారీ ఎత్తున బ్యాంకుల్లో 500, 1000 నోట్లు జమ అవుతున్నాయి. ముంబైలోని ఒక ప్రభుత్వ బ్యాంకులో సుమారు 60,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తొలి రోజైన గురువారం 31,000 కోట్ల రూపాయల నగదు జమ కాగా, రెండో రోజైన శుక్రవారం మధ్యాహ్నానికి మరో 22,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి.
దీంతో రెండు రోజుల్లో సుమారు అరవై వేల కోట్లకుపైగా పెద్ద నోట్లు జమ అయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. అదే సమయంలో ఈ రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల ద్వారా సుమారు 1500 కోట్ల రూపాయల నగదును రద్దైన పెద్ద నోట్ల స్థానంలో మార్పిడి చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో ఒక్క ఎస్బీఐలోనే ఇంత మొత్తం జమ అయితే, మిగిలిన బ్యాంకులన్నీ కలుపుకుంటే ఎంత మొత్తం జమ అయి ఉంటుందని అంతా ఆశ్చర్యపోతున్నారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు