పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఒక్కే ఒక్క మాటతో దేశంలో ఏకంగా 2,320 కోట్ల పెద్ద నోట్లు రద్దయ్యాయి. వాటి విలువ సుమారు రూ.15 లక్షల కోట్లు. ఈ సొమ్ములో నలుపు ఎంత? తెలుపు ఎంత? అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు తమ వద్ద ఉన్న రూ.1000, రూ.500 నోట్లను మార్చుకుంటేనే అది తెల్లధనంగా మారుతుంది. డిసెంబరు 30లోగా పెద్దనోట్లను మార్చుకోకపోతే మిగిలినదంతా నల్లధనంగానే భావించాల్సి ఉంటుంది. కష్టార్జితమైతే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవడం పెద్ద సమస్య కాదు. గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది.
నల్లధనమైతే మాత్రం చిక్కుల్లో పడినట్టే. ఆర్థిక విభాగం నిఘాకు చిక్కి ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది. మారుపేర్లతో అనుమానాస్పదంగా పెద్దమొత్తంలో నగదు మార్చుకునే ప్రయత్నం చేస్తే బ్యాంకు సిబ్బంది ఆర్థిక నిఘా విభాగానికి వారి పొటోలతో సహా సమాచారం పంపిస్తారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రకారం.. దేశంలో రూ.1650 కోట్ల రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటి విలువ రూ.8.25 లక్షల కోట్లు. చలామణిలో ఉన్న వెయ్యి రూపాయల నోట్ల సంఖ్య 670 కోట్లు. వాటి విలువ రూ.6.7 లక్షల కోట్లు. దీనిని బట్టి మంగళవారం రాత్రి నుంచి రద్దయిన నోట్ల విలువ రూ.14.95 లక్షల కోట్లు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు