ఆమె పేరు కుష్బూ శర్మ... అందంగా కనిపిస్తుంది. అదే వంద మందికిపైగా యువకులకు శాపమైంది. అందాన్ని ఎరగా వేసి, ధనవంతులను టార్గెట్ గా చేసుకుని వారిని బెదిరిస్తున్న యువతిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కుష్బూపై వందకు పైగా కేసులు నమోదవడం గమనార్హం. రాజస్థాన్ కు చెందిన ఈ యువతి, ఫేస్ బుక్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకునేది. ఆపై వారిలో ధనవంతులైనవారిని టార్గెట్ చేసి కాఫీ కేఫ్ లు, రెస్టారెంట్లకు ఆహ్వానించేది. వారితో సన్నిహితంగా మెలగుతూ సెల్ఫీలు తీసుకునేది.
ఆపై అసలు కథ మొదలు పెట్టి, డబ్బు ఇవ్వకుంటే, అత్యాచారయత్నం కేసు పెడతానని బెదిరించి అందినకాడికి డబ్బు గుంజేది. ఇదే క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది ఆమెకు పరిచయం కాగా, ఆపై కుష్బూ, అతని ఇంటికి వెళ్లి, రూ. 1.75 లక్షల నగదు, ఐఫోన్ తో పారిపోయింది. కొన్ని రోజుల తరువాత తిరిగి అతనికి ఫోన్ చేసి, తిరిగి మాయమాటలు చెబుతుండటంతో, సదరు న్యాయవాది పోలీసుల సాయంతో వలపన్ని కుష్బూను పట్టుకున్నాడు. ప్రస్తుతం ఆమె నేరాలపై మరింత లోతైన విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు