: నెవడా ర్యాలీలో ట్రంప్ ను కాపాడేందుకు దూసుకొచ్చిన సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు... సభలో కలకలం!


నెవడాలో తుది దశ ప్రచారాన్ని డొనాల్ట్ ట్రంప్ నిర్వహిస్తున్న సమయంలో, సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఆయనకు రక్షణగా నిలిచి హుటాహుటిన తరలించారు. సభలోని ఓ వ్యక్తి దగ్గర తుపాకీ ఉందన్న సమాచారం అందడంతోనే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ మాట్లాడుతున్న వేళ, సభికుల్లో కాస్తంత అలజడి కనిపించింది. కన కళ్లకు చేతిని అడ్డుపెట్టుకుని దూరంగా ఏం జరుగుతుందా? అన్న ఆసక్తితో ట్రంప్ చూస్తుండగా, ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు పరుగున వచ్చి ఆయన్ను స్టేజ్ వెనక్కు తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రజలు ఆందోళనతో హాహాకారాలు చేశారు. ఆపై కాసేపటికి భద్రతాదళాలు తనిఖీలు పూర్తి చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దురదృష్టకర సంఘటనలేవీ జరుగకుండా చూసేందుకే ట్రంప్ ను స్టేజ్ నుంచి పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు.

  • Loading...

More Telugu News