Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘యమదొంగ’ చూసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానినయ్యాను: వరుణ్ సందేశ్

యమదొంగ చిత్రం చూసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ అయ్యానని ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ అన్నాడు. దీపావళి సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. ప్రత్యేకంగా తనకు ఒకరంటూ ఫేవరెట్ ఆర్టిసులు లేరని, కాకపోతే, ‘యమదొంగ’ చిత్రం చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తనకు ఫేవరెట్ హీరో అయ్యాడని చెప్పాడు. మొదటి సినిమాలో తాను నటించినప్పుడు చాలా భయపడ్డానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆదరించే మంచి చిత్రం చేయాలని చూస్తున్నానని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ చెప్పాడు.

More Telugu News