'వెరీ వెరీ అన్ హ్యాపీ దీపావళి' అంటూ రాంగోపాల్ వర్మ విషెస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వెరీ వెరీ అన్ హ్యాపీ దీపావళి' అంటూ రాంగోపాల్ వర్మ విషెస్

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండి, తనదైన శైలిలో విమర్శలు చేస్తుండే దర్శకుడు రాంగోపాల్ వర్మ దీపావళి విషెస్ ను 'వెరీ వెరీ అన్ హ్యాపీ దీపావళి' అంటూ ఇచ్చాడు. పటాకులు పేల్చడం వల్ల జింక్, సోడియం వంటి విష వాయువులు గాల్లోకి వదులుతున్న వారందరికీ అన్ హ్యాపీ దీపావళి అని ట్వీట్ చేశాడు. టపాకాయలు కాలుస్తూ భారీ శబ్దాలను సృష్టించడంతో పాటు వయోవృద్ధులను, చిన్నారులను ఇబ్బంది పెడుతున్న వారికి అన్ హ్యాపీ దీపావళి అన్నాడు. ఆస్థమా వంటి వ్యాధులతో బాధపడేవారి సమస్యలను మరింతగా పెంచే వారికి, శబ్దాలు, కాంతులతో పక్షులను కష్టపెట్టేవారికి, నరకాసురుడి గురించి తెలియకుండా, అతని చావును సెలబ్రేట్ చేసుకునే వారికి అన్ హ్యాపీ దీపావళి అంటూనే... తనకు మాత్రం నిత్యమూ దీపావళి పండగేనని చెప్పుకొచ్చాడు.

More Telugu News