పోలీసుల వద్దే ఆర్కే... ఏ క్షణమైనా చంపేస్తారంటున్న ఆదివాసీ నేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల వద్దే ఆర్కే... ఏ క్షణమైనా చంపేస్తారంటున్న ఆదివాసీ నేత

సీనియర్ మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నారని, ఆయనతో పాటు అరెస్ట్ చేసిన మరో 9 మందినీ పోలీసులు ఏ క్షణమైనా ఎన్ కౌంటర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆదివాసీ హక్కులు, సంస్కృతి పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ తిలక్‌ ఆరోపించారు. గత వారంలో ఎన్ కౌంటర్ జరిగినప్పుడు ఆర్కే గాయపడ్డారని, ఆపై పోలీసులు ఆయన్ను నిర్బంధించారని చెప్పిన ఆయన, మరణించిన మావోయిస్టు డానియేల్ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు మల్కన్ గిరికి వచ్చారు. ఏజన్సీ ప్రాంతంలోని బాక్సైట్ గనులను దోచుకునేందుకు ప్రణాళికలు వేసిన పెట్టుబడిదారులు, ఈ ప్రాంతంలోని మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా తుడిచిపెట్టాలని భావిస్తున్నారని, తాగే టీలో మత్తు మందు కలిపి పంపి, ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. కాగా, మరణించిన మావోయిస్టుల్లో 13 మృతదేహాలను గుర్తించి తీసుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వీటికి నేడు సామూహిక అంత్యక్రియలు చేయనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News