మసూద్ అజర్ ఉగ్రవాదే... తొలిసారి నిజం చెప్పిన ముషార్రఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మసూద్ అజర్ ఉగ్రవాదే... తొలిసారి నిజం చెప్పిన ముషార్రఫ్

జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదేనని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తొలిసారిగా అంగీకరించారు. మసూద్ తమ దేశంపైనా బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడని తెలిపారు. పాకిస్థాన్ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో, మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనాను ఒప్పిస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ముషార్రఫ్ సూటిగా సమాధానం చెప్పలేదు. మసూద్ తో చైనాకు సంబంధం లేదని, అసలు ఈ విషయంలో చైనా తలదూర్చాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా ప్రకటించే అంశం రాగా, చైనా తన వీటో హక్కుతో అడ్డుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News