Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మావో జెడాంగ్ స్థాయి శక్తిమంతమైన కోర్ లీడర్ గా జిన్ పింగ్ కు గుర్తింపు

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మావో జెడాంగ్ స్థాయి నేతగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా గుర్తించింది. శక్తిమంతమైన కోర్ లీడర్ గా ఏకగ్రీవంగా గుర్తింపునిచ్చింది. 2012 నవంబర్లో జిన్ పింగ్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు, చైనా బలమైన శక్తిగా ఆవిర్భవించడంలాంటివి పార్టీని గర్వపడేలా చేశాయని ఆ పార్టీ సెంట్రల్ కమిటీ ప్రకటించింది. మరో ఆరేళ్లపాటు పార్టీ అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఉండనున్నారు. అవసరమైతే మరికొంత కాలం తన పదవిని పొడిగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News