Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘విశాఖ’కు చేరుకున్న భారత్-న్యూజిలాండ్ జట్లు

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి, ఐదో వన్డే మ్యాచ్ విశాఖపట్టణంలో ఎల్లుండి జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు కొద్దిసేపటి క్రితం ‘విశాఖ’కు చేరుకున్నాయి. కాగా, నిన్న రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన నాల్గో వన్డేల్లో మొదటి, మూడో మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించగా; రెండు, నాల్గో వన్డే మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ నెగ్గింది. దీంతో, రెండు జట్ల స్కోరు 2-2గా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో జరగనున్న చివరి వన్డే లో గెలిచి, సిరీస్ ను సాధించేందుకు రెండు జట్లు కసరత్తు చేస్తున్నాయి.

More Telugu News