చైతూ లేకపోతే ఉండలేను: సమంత
నాగచైతన్య లేకుండా ఉండలేనని సినీ నటి సమంత తెలిపింది. అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ ఛాట్ చేసిన సమంత... అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని 'ఇవి లేకపోతే నేను జీవించలేను.. అనిపించే ఓ మూడింటి గురించి చెప్పండి' అని అడిగాడు. అతనికి సమాధానమిస్తూ 'చైతూ, మస్కతీ ఐస్ క్రీం, వర్క్.. ఈ మూడూ లేకపోతే ఉండలేను' అని తెలిపింది. ప్రేమమ్ సినిమాలో నటనకు గాను చైతన్యకి వచ్చిన ప్రశంసల పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పింది. 'చైతన్యను ఎందుకు? నన్ను వివాహం చేసుకోవచ్చు కదా?' అన్న ఓ తుంటరి అభిమాని ప్రశ్నకు 'కచ్చితంగా చేసుకోకూడదు. ఎందుకంటే మనం 8 ఏళ్ల క్రితం కలవలేదుకదా? మనం బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కదా?' అని సమాధానమిచ్చింది.