మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత.. గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత.. గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మినుములూరులో 9, లంబసింగిలో 9, చింతపల్లిలో 12, అరకులో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల వరకు సూర్యుడి జాడ లేకపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. సాయంత్రం ఐదు గంటలు దాటితే మళ్లీ చలి విజృంభిస్తోంది.

More Telugu News