తెలంగాణ వచ్చాక తొలిసారి కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా దీక్షకు దిగిన కోదండరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ వచ్చాక తొలిసారి కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా దీక్షకు దిగిన కోదండరామ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జేఏసీ చైర్మన్ కోదండరామ్ తొలిసారిగా దీక్షను చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపిస్తూ, ఈ ఉదయం 10 గంటలకు హైదరాబాదు, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని ఇందిరా పార్కు వద్ద 'రైతు దీక్ష' చేపట్టారు. ఆయనతో పాటు పలు రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు పాల్గొనడం, పెద్ద ఎత్తున పోలీసులను ఈ ప్రాంతంలో మోహరించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

More Telugu News