Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాపై భూకబ్జా ఆరోపణలు అసత్యం.. నా భూమే ఆక్రమణకు గురైంది: ఎమ్మెల్యే కాకాని

త‌న‌పై వ‌స్తోన్న భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి ఖండించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... భూకబ్జా విష‌యంలో త‌న‌పై వ‌స్తోన్న ఆరోపణలు స‌త్య‌దూర‌మ‌ని పేర్కొన్నారు. త‌న భార్య‌కు తన అత్త‌మామ‌లే ఆరు ఎక‌రాల‌ భూమి ఇచ్చారని ఆయ‌న చెప్పారు. తాము ప్ర‌స్తుతం ఆ భూమిని కౌలుకు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. దళితుల భూములతో కలిపి కంచె వేసిన విషయం గురించి త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. అంతేగాక‌, తమ భూమే కొంత మేర‌కు క‌బ్జాకు గురైందని అన్నారు. ప‌లువురు తనపై అస‌త్య‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News