Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన బ్యాంకులపై పాకిస్థాన్ సైబర్ అటాక్స్?... అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

19 బ్యాంకుల డెబిట్ కార్డుల సమాచారం అంతర్జాతీయ నేరగాళ్ల చేతికి చిక్కిందనే వార్త ఇప్పటికే భయాందోళనలకు గురి చేస్తోంది. తాజాగా, మన బ్యాంకులపై పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే అవకాశం ఉందని సైబర్ భద్రతా ఏజన్సీ హెచ్చరించింది. దీంతో, బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు నోటీసులు కూడా అందాయి. ఈ సైబర్ భద్రతా ఏజన్సీ ఆర్బీఐతో కలసి పనిచేస్తుంది. భారత ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన విభాగం ఇది. భారత బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగిందని, 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిందని గత గురువారం వెల్లడైంది.

More Telugu News