అమీర్ లాంటి ఇడియట్సే ఇలాంటి సినిమా చేయగలరు: విధు వినోద్ చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమీర్ లాంటి ఇడియట్సే ఇలాంటి సినిమా చేయగలరు: విధు వినోద్ చోప్రా

అమీర్ లాంటి ఇడియట్సే.. అంటే ఎక్కువ పనిచేసేవారు ‘దంగల్’ వంటి సినిమా చేయగలరని ‘త్రీ ఇడియట్స్’ నిర్మాత విధు వినోద్ చోప్రా ప్రశంసించారు. ముంబయిలో జరిగిన మామి ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన ఆయన, ‘దంగల్’లో అమీర్ మల్లయోధుడిగా కనిపించిన తీరును కొనియాడారు. ఈ సందర్భంగా విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ, ఓ నటుడిగా అమీర్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. తనలోని నైపుణ్యాన్ని అమీర్ స్వతహాగా మరింత మెరుగు పర్చుకుంటున్నాడని అన్నారు. కాగా, నిన్న విడుదలైన ‘దంగల్’ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.

More Telugu News