Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరవుకు పాస్వర్డ్ చంద్రబాబు.. అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ కూడా ఆయనే!: రోజా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. శ్రీకాళహస్తిలో ప‌ర్య‌టిస్తోన్న ఆమె అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. చంద్ర‌బాబు కరవుకు పాస్వర్డ్ అని ఆమె అన్నారు. అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ కూడా ఆయ‌నే అని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్య‌మంత్రి తన సొంత జిల్లాలో చ‌క్కెర క‌ర్మాగారాల‌ను మూయించేశాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేగాక‌, మన్నవరం ప్రాజెక్ట్ను చంద్ర‌బాబు వేరే చోటుకి తరలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో క‌ర‌వు ప‌రిస్థితిపై ఇంత‌వ‌ర‌కు ఏపీ స‌ర్కారు కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై చంద్రబాబు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News