అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇస్తాడు: ట్రంప్ పై గ్లోరియా ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇస్తాడు: ట్రంప్ పై గ్లోరియా ఫైర్

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు మహిళల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఇప్పటికే పలు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రంప్ పై ప్రముఖ ఫెమినిస్ట్ గ్లోరియా స్టీనిమ్ విరుచుకుపడ్డారు. ట్రంప్ కు మహిళలపై గౌరవం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తన సంస్థల్లో మహిళలు ఎదగడానికి దోహదపడతానని ట్రంప్ చెబుతున్నప్పటికీ... స్త్రీలపై ఆయనకు ఉన్న చులకన భావాన్ని ఈ వ్యాఖ్యలు కప్పిపుచ్చలేవని అన్నారు. అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇవ్వడం ట్రంప్ శైలి అని... 10కి 10 రేటింగ్ ఉన్న మహిళలనే ట్రంప్ టార్గెట్ గా పెట్టుకుంటాడని తెలిపారు. అయితే, ఆయన ప్రవర్తనకు మాత్రం తాము జీరో రేటింగ్ ఇస్తామని ఆమె వ్యంగ్యంగా అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పై ఆరోపణలు వచ్చినప్పుడు గ్లోరియా స్టీనిమ్ వాటిపై దర్యాప్తు చేశారు. అయితే, ట్రంప్ తో పోల్చుకుంటే క్లింటన్ కేసులు కొంచెం భిన్నమైనవని ఆమె అభిప్రాయపడ్డారు. పౌలా జోన్స్ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని... మీరు ఏమీ చేయవద్దంటూ స్వయంగా బిల్ క్లింటనే అన్నట్టు ఆమె చెప్పారు.

More Telugu News