హైకోర్టును ఆశ్రయించిన టాప్ కమెడియన్ కపిల్ శర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైకోర్టును ఆశ్రయించిన టాప్ కమెడియన్ కపిల్ శర్మ

బుల్లి తెరపై తన షోలతో అదరగొడుతున్న టాప్ కమెడియన్ కపిల్ శర్మ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలోని తన అపార్ట్ మెంట్ విషయంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తనను లంచం అడిగారంటూ ఆయన ఆరోపించాడు. అంతేకాదు, ఈ లంచం వ్యవహారం గురించి ప్రధానమంత్రినే ట్యాగ్ చేసి, ఆయన చేసిన ట్వీట్ సంచలనం కూడా రేపింది. అయితే, కపిల్ శర్మ కట్టడం అక్రమమని, పార్కింగ్ కోసం కేటాయించాల్సిన స్థలంలో కట్టడాలు కట్టారని బీఎంసీ అధికారులు చెప్పారు. అంతేకాదు, కపిల్ శర్మతో పాటు బిల్డర్ మీద కూడా కేసులు పెట్టారు. ఈ క్రమంలో, అపార్టు మెంటులో కొంత భాగాన్ని కూల్చేయాలన్న అధికారుల ఆదేశాలను సవాల్ చేస్తూ కపిల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News