హనుమంతుడి వేషం వేసి... లంకాదహనానికి వెళుతూ ప్రాణాలు కోల్పోయాడు... విషాదకర వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనుమంతుడి వేషం వేసి... లంకాదహనానికి వెళుతూ ప్రాణాలు కోల్పోయాడు... విషాదకర వీడియో!

దసరా పండగ నాడు అత్యంత ఆనందోత్సాహాల నడుమ 'రామ్ లీల' ప్రదర్శన సాగుతుండగా, జరిగిన విషాదకర ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 60 ఏళ్ల వ్యక్తి, హనుమంతుడి వేషం వేసి, ఓ భవంతి ఎక్కి, అక్కడి నుంచి ఇరువైపులా నిప్పులతో తాళ్ల సాయంతో కిందకు జారుతూ, లంకాదహనానికి కదులుతున్న వేళ, పట్టుతప్పి కిందపడి చనిపోయాడు. ఈ ఘోర దుర్ఘటన రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగింది. ఘటన ఆసాంతం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News