Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుదీర్ఘకాలం పడక గదిని పంచుకోనివ్వకుంటే విడాకులే: ఢిల్లీ హైకోర్టు

సుదీర్ఘకాలం పాటు భర్తను పడకగది పంచుకోనీయకుండా, అతనితో శృంగారాన్ని నిరాకరిస్తున్న భార్యతో విడాకులు కోరే హక్కు భర్తకుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగున్నరేళ్లుగా, భార్య తనను దగ్గరకు చేర్చడం లేదని, ఆమెకు శారీరక ఇబ్బందులు, సమస్యలు లేకున్నా, తనను మానసిక హింసకు గురి చేస్తోందని ఓ భర్త వేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం, అతనికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భార్య వల్ల భర్తకు ఎంతో మానసిక ఆందోళన కలిగిందని, ఒకే ఇంట్లో ఉంటున్నా అతడికి సంసార సుఖం దక్కలేదని, ఎలాంటి కారణం లేకుండా శృంగారాన్ని నిరాకరించారని తేలడం వల్ల విడాకులు ఇవ్వ వచ్చని తేల్చింది.

More Telugu News