వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అశ్విన్ సొంతం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అశ్విన్ సొంతం

టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే, గత వందేళ్లలో అశ్విన్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. 49.4 స్ట్రైక్ రేట్ తో అశ్విన్ కొనసాగుతున్నాడు. ఈ వందేళ్ల కాలంలో ఇంతవరకు 50 కన్నా తక్కువ స్ట్రైక్ రేట్ గల బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. అశ్విన్ తరువాతి స్థానంలో 54 స్ట్రైక్ రేట్ తో మెక్ గిల్ (ఆస్ట్రేలియా), 55 స్ట్రైక్ రేట్ తో ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)లు ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి బీఎస్ చంద్రశేఖర్ (13వ స్థానం), అనిల్ కుంబ్లే (14) ఉన్నారు. ఇక ఆల్ టైం టెస్ట్ హిస్టరీకి వస్తే... 1910లో క్రికెట్ ఆడిన ఇంగ్లండ్ బౌలర్లు జానీ బ్రిగ్స్, కొలిన్ బ్లైత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో అశ్విన్ ఉండగా... స్పిన్ దిగ్గజాలు మురళీధరన్, షేన్ వార్న్ లో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.

More Telugu News