Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాసిక్ లో చిన్నారిపై అత్యాచారయత్నం.. మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత!

నాసిక్ లో ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం సంఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. త్రయంబకేశ్వర్ లోని తాలేగావ్ లో ఈ సంఘటన ఇటీవల జరిగింది. దీంతో, పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవడంతో పాటు హింసాత్మక సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వదంతులు వ్యాపించకుండా ఉండడానికి నాసిక్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాగా, నాసిక్ ఐజీ కారుతో పాటు పోలీస్ వాహనాలను మూడింటిని ఆందోళనకారులు నిన్న తగులబెట్టారు. వారిని అదుపు చేసే నిమిత్తం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

More Telugu News