కన్న కూతురునూ వదలని ట్రంప్.. ఆమె అందంపై అశ్లీల వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కన్న కూతురునూ వదలని ట్రంప్.. ఆమె అందంపై అశ్లీల వ్యాఖ్యలు

వివాదాలే ఊపిరిగా నెట్టుకొస్తున్న రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకర వ్యాఖ్యలకు పెట్టింది పేరైన ఆయన తన కన్న కూతురుపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆరడుగుల తన కుమార్తె దేహ సౌష్టవం గురించి ఓ తండ్రి వర్ణించలేని రీతిలో వర్ణించి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఆయన చేసిన వ్యాఖ్యల టేపులు ఇటీవల బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనపై విమర్శల జడివాన కురుస్తోంది. ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న దశలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు మద్దుతు ఇచ్చే ప్రసక్తే లేదని, ఆయన స్థానంలో మరొకరిని ప్రకటించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు శనివారం వెలుగులోకి వచ్చాక ట్రంప్ ప్రభ మసకబారడం మొదలైంది. నమ్ముకున్న వారు సైతం ఆయనకు దూరమవుతున్నారు. భర్తను తాను క్షమించినట్టు ప్రజలు కూడా క్షమించాలని ట్రంప్ భార్య వేడుకుంటుండగానే.. కన్నకూతురిపై ట్రంప్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. పలుమార్లు కుమార్తెపై చేసిన అసభ్యకర వాఖ్యలను సీఎన్ఎన్ బయటపెట్టడంతో తీవ్ర దుమారం రేగింది. అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నా ట్రంప్ మాత్రం పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. పోటీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.

More Telugu News